Listen to this article

జనం న్యూస్ జనవరి 26

ఘట్కేసర్ ప్రతినిధి మేడ్చల్ జిల్లా పోచారం సర్కిల్ 8వ వార్డు రాజీవ్ గృహకల్పలో ని గాంధీ బొమ్మ సర్కిల్ వద్ద పోచారం సర్కిల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు దేవేందర్ ముదిరాజ్ మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు వినయ్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీం రేవంత్ రెడ్డి మెంబర్ సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి పాల్గొని స్వాతంత్ర సమరయోధులు జాతిపిత మహాత్మా గాంధీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మరియు బాబు జగ్జీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలాలను కొనియాడుతూ ఆర్ జీకే కాలనీవాసులు అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మెట్టు నరసింహారెడ్డి,బలరాం ఆంజనేయులు,రామచందర్, రమేష్ జాఫర్ కొండయ్య శివకుమార్ నాయక్ అజయ్ యాదవ్ శ్రవణ్ శశికళ పావని రేణుక లతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.