జనం న్యూస్ 27 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
మున్సిపాలిటీ ఎన్నికలకు షెడ్యూల్ నేడు వచ్చే ఛాన్స్ ఉంది.అన్ని మున్సిపాలిటీ లలో పోటీ చేసేందుకు బీజేపీ అభ్యర్థులు సిద్ధమవుతున్నారు.ఎన్నికల్లో గద్వాల మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థులను పెద్ద ఎత్తున గెలిపించాలని పట్టణ ప్రజలను కోరుతున్నాను.పదేళ్లుగా గద్వాల బాగుకోరిన వారు ఎవరు లేరు. మున్సిపాలిటీలలో పరిస్థితులు అస్తవ్యస్తంగా, ఇండ్లు లేని నీరుపేద ప్రజలు ఉన్నారు.పిల్లికుంట్లలో నాడు మంత్రి హోదాలో 3 వేల మందికి పట్టాల పంపిణీ చేశాం.ప్రైవేటు భూములు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసి.. మార్కెట్ రేటు ప్రకారం ఇవ్వాలని భావించి.. సొంత నిధులు అదనంగా ఖర్చు చేసి 78 ఎకరాల భూమి కొనుగోలు చేసి పేదలకు పట్టాలు పంపిణీ చేశాం.గద్వాల ఎమ్మెల్యే బి ఆర్ యస్ లో ఉన్నారో.. కాంగ్రెస్ లో ఉన్నారో ప్రజలకు తెలుసు. బి ఆర్ యస్ ఎమ్మెల్యే అయితే ఆ పార్టీ నుంచి ఓట్లు అడగాలి.. కానీ అది చేయడం లేదు.ఎమ్మెల్యే కాంగ్రెస్ లో కొనసాగుతున్నారని స్పష్టం అవుతుంది.
అభివృద్ధి కోసం అధికార పార్టీకి వెళ్ళమని అంటున్నారు.. ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి.ప్రజలకు పంపిణీ చేసిన ప్లాట్ల పట్టాలు లాక్కొని.. డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తామని అసెంబ్లు ఎన్నికల్లో ఆశ చూపారు.ఇప్పటికి ఆ పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కూడా ఇవ్వలేదు.గద్వాల లో ఆసుపత్రికి, స్కూల్ కి, కాలేజికి అన్నింటికి ఆ భూమిని వినియోగిస్తున్నారు.కాంగ్రెస్, బి ఆర్ యస్ లకు ఓటు అడిగే హక్కు లేదు.
సొంత స్థలం ఉంటేనే ఇండ్లు ఇస్తామని అంటున్నారు..పట్టణప్రాంత ప్రజలను పదేపదే మోసం చేస్తున్నారు.2లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు నెట్టెంపాడు కొట్లాడి తీసుకువస్తే.. బి ఆర్ యస్ చేసిందని చెప్పుకుంటున్నారు..అలా చెప్పుకోవడానికి వాళ్ళది నోరా ,మోరా అర్ధం కావడం లేదు రాష్ట్ర ప్రభుత్వం స్థలం లేని వాళ్లకు స్థలం తో పాటు.. ఇండ్లు నిర్మించి ఇవ్వాలి.గద్వాల చీరలకు మంచి వ్యాపారం ఉన్న.. చేనేత పార్కు మాత్రం ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్లు ఉంది.అభివృద్ధి ఎవరు చేశారో ప్రజలకు తెలుసు..పార్లమెంట్ ఎన్నికల్లో 21 వేల ఓట్ల బీజేపీ కి మెజారిటీ ఇచ్చారు.కుల మత బేధం లేకుండా బీజేపీని గెలిపించండి.గద్వాల అభివృద్ధి కుంటుపడటం చూస్తే బాధ కలుగుతుంది.కొట్లాడి గద్వాల జిల్లా కేంద్రాన్ని సాధించుకున్నాం.
డబ్బు ప్రలోభాలకు ప్రజలు ఓటు అమ్ముకోకండి.పని చేసే వ్యక్తులు ఎవరు అని ఆలోచింది ఓటు వేయండి.ప్రతి మున్సిపల్ వార్డులలో బీజేపీ విజయడంఖ ముగించాలి.గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయో ఆలోచించి పార్టీ టిక్కెట్ ఇస్తుంది.టిక్కెట్ ఎవరికి వచ్చినా అందరూ కలసి బీజేపీ విజయానికి కృషి చేయాలి.


