Listen to this article

జనం న్యూస్ జనవరి 27 ముమ్మడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

రాజమహేంద్రవరం పార్లమెంటు మాజీ సభ్యులు మాగంటి మురళి మోహన్ పద్మశ్రీ అవార్డు కైవసం చేసుకోవడంపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర సెయిల్ అభివృద్ధి కమిటీ మాజీ డైరెక్టర్ నీరుకొండ వీరన్న చౌదరి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. భారత గణతంత్ర దినోత్సవశీ సందర్భంగా వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం అందించే పద్మశ్రీ, పద్మ విభూషణ్ అవార్డుల
ప్రధానోత్సవ ప్రకటన ఆదివారం సాయంత్రం వెలువడింది. వీటిలో రాజమండ్రి మాజీ ఎంపీ, తమకు అత్యంత సన్నిహితులు మురళి మోహన్ పద్మశ్రీ అవార్డు దక్కించుకోవడం తమకు ఎంతో సంతోషాన్నిచ్చిందని వీరన్న చౌదరి పేర్కొన్నారు. సామాజిక సేవ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనే మంచి మనస్తత్వం ఉన్న మురళీమోహన్ కు పద్మశ్రీ వంటి అత్యున్నతమైన పురస్కారం లభించడం ఈ ప్రాంత వాసులు ఆయన అభిమానులు ఆశించదగ్గ విషయమని ఆయన పేర్కొన్నారు. మురళీమోహన్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పురస్కారాలు సాధించాలని సందర్భంగా వీరన్న చౌదరి ఆకాంక్షించారు.