జనం న్యూస్ 27 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
శాంతి భద్రతల పరిరక్షణలో దూకుడుగా వ్యవహరిస్తూ, ప్రజా సేవలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆండ్ర పోలీస్ స్టేషన్ ఎస్సై కె. సీతారాంను ఉత్తమ అధికారిగా జిల్లా యంత్రాంగం గుర్తించింది. ఆయన సేవలను గుర్తించిన జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి, జిల్లా ఎస్పీ దామోదర్ లు ఎస్సై సీతారాంను ప్రత్యేకంగా అభినందించి ప్రశంసాపత్రం అందజేశారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ప్రజల భద్రతే లక్ష్యంగా చట్ట అమలులో నిబద్ధతతో పనిచేస్తూ, నేర నియంత్రణ, శాంతి భద్రతల నిర్వహణలో ఎస్సై సీతారాం చూపిన చొరవ ప్రశంసనీయమన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ, సమస్యలను తక్షణమే పరిష్కరించే విధానం వల్ల పోలీస్ శాఖపై ప్రజల విశ్వాసం మరింత పెరిగిందని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో విధులు నిర్వర్తించి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.


