Listen to this article

జనం న్యూస్ 27 జనవరి 2027 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలం మాచర్ల గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల యందు గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జి మాచర్ల ప్రకాష్ వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక శక్తివంతమైన భారత రాజ్యాంగాన్ని డాక్టర్ అంబేద్కర్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి తన రక్తపు బొట్టుతో రచించి పౌరులందరికీ స్వేచ్ఛ సమానత్వం సౌబ్రాతత్వాన్ని, సాంఘిక, రాజకీయ, హక్కులు కల్పించడం జరిగిందని అన్నారు సందర్భంగా విద్యార్థులకు అంబేద్కర్ చేసిన సేవలు గుర్తు చేయడం జరిగింది ప్రతి విద్యార్థి భారత రాజ్యాంగాన్ని చదవాలని భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులు అవకాశాలను తెలుసుకొని ముందుకు వెళ్లాలని ఉన్నత చదువులు చదవాలని కోరారు