Listen to this article

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి 27

ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో గ్రామ వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సర్పంచ్ జగదాంబ సోమప్ప మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి హక్కులు కల్పించడంతో పాటు బాధ్యతలను కూడా గుర్తు చేస్తుందని తెలిపారు. గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఐక్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు అలరించాయి. ఈ కార్యక్రమం గ్రామంలో దేశభక్తి వాతావరణాన్ని నెలకొల్పిందని పాల్గొన్నవారు తెలిపారు.