జనం న్యూస్ జనవరి 27 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
క్రీడలు శారీరక మానసిక వికాసానికి వికాసాన్ని పెంపొందిస్తాయి యువత క్రీడల పై ఆసక్తి పెంపొందించుకోవాలి – టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ఫతేనగర్ డివిజన్ పరిధి ఇందిరాగాంధీ పురంలో కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ జహంగీర్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ పోటీలు జరిగాయి ఈకార్యక్రమాలకు ముఖ్య అతిథిగా టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ హాజరయ్యారు విజేతలకు ట్రోఫీలు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్బంగా రమేష్ మాట్లాడుతూ నేటి యువత క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారన్నారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. విద్యార్థి దశ నుంచి క్రీడలపై ఆసక్తి పెంపొందించు కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కుక్కల రమేష్ ,గొట్టుముక్కల వెంకటేశ్వరరావు ,వరహాల స్వామి ,నవాబ్, వినయ్, హమీద్ ,నర్సింగ్, అహ్మద్ ఖాన్ ,కిట్టు తదితరులు పాల్గొన్నారు.



