జనం న్యూస్:వనపర్తి డివిజన్ పెబ్బేరు రిపోటర్ శివకుమార్ జనవరి 27
పెబ్బేరు మంగళవారం పెబ్బేరు మున్సిపాలిటీ లోని 50 శాతంగా వున్న ముదిరాజ్ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ నుండికూడా కౌన్సిలర్ ఎన్నికకు అవకాశాలు ఇవ్వాలని ముదిరాజ్ కుటుంబాలు వనపర్తి శాసనసభ్యులు తూడి మెగారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు ముదిరాజులు ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపాలిటీ లో సగానికి పైగా ముదిరాజ్ వర్గo ఓటర్లు ఉన్నారు అందుకని జనాభా ప్రాతిపదికన వార్డు కౌన్సిలర్ సీట్ల కేటాయింపులు తమకు న్యాయం చేయాలని కోరారు ముదిరాజులు రాజకీయంగా ఎదిగేందుకు ఎమ్మెల్యే సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కి శ్రీనివాస్ గౌడ్ పెబ్బేర్ మార్కెట్ ఉపాధ్యక్షుడు విజయవర్ధన్ రెడ్డి మాలపల్లి మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్ ముదిరాజ్ సంగం సభ్యులు మాజీ ఎంపీటీసీ చింతకాయల కరెన్న గోల్డ్ బా లస్వామి కటికల ఆనంద్ కటికల వినోదు గోనెల కురుమూర్తి మహేష్ తదితరులు పాల్గొన్నారు
c


