Listen to this article

జనం న్యూస్ జనవరి 27 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

రాందేవ్రావు హాస్పిటల్ కి గవర్నర్ ద్వారాతెలంగాణ ఉత్తమ హాస్పిటల్ గా ఎంపిక 77 వ గణతంత్ర దినోత్సవన్నీ పురస్కరించుకొని 26 న గవర్నర్ ఎక్సలెన్సీ 2025 ఎట్ హోమ్ కార్యక్రమాన్ని లోక్ భవన్ నందు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మరియు సుధాదేవ్ వర్మ, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికార పార్టీ కార్యకర్తలతో పాటు బీజేపీ, బి ఆర్ ఎస్,ఐఏఎస్, ఐపీస్, విదేశీ రాయభారులు, స్వతంత్ర సమరయోధులు ఈ కార్యక్రమానికి హాజరైనవరిలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, రాష్ట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు అడలూరి లక్షమన్, మాజీ గవర్నర్ బండారు దత్తత్రేయ, ఎంపీ ఈటెల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు,కె కేశవరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు బి ఆర్ ఎస్ మ్మెల్సీ రమణ డి శ్రవణ్, ఎమ్మెల్యే వివేకానంద, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ రావు, డీజీపీ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గ్రామీణ మరియు ఫిలాంట్రోపీ వైద్య సేవల నిమిత్తము రాందేవ్రావు ఆసుపత్రి ని ఎంపిక చేయడం జరిగింది.
దీనిలో ఆరోగ్య శిభిరాలు, పాఠశాల ఆరోగ్య కార్యక్రమం, వ్యాధి నిరోధక టీకాలు, ఉచిత కంటి మరియు శస్త్ర చికిత్సల ద్వారా సేవలoదించి గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిరక్షణ లో రాందేవ్రావు ఆసుపత్రి సేవలు మరువలేనివి. ఈ పురస్కారం 2 లక్షల రూపాయలు నగదు బహుమతి మరియు అవార్డు గ్రహీతలకు ప్రశంస పత్రాన్ని లోక్ భవన్ హైదరాబాద్ నందు ఇచ్చి గవర్నర్ సత్కరించారు.ఈ అవార్డు ను రాందేవ్రావు ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ కే కమలాకర్ అందుకున్నారు.ఈ కార్యక్రమం నిమిత్తము మంగళవారం నాడు రాందేవ్రావు ఆసుపత్రి మానేజ్మెంట్ అభినందన కార్యక్రమం నిర్వహించి ఉద్యోగులనందర్నీ అభినందించింది ఈ అవార్డు ద్వారా రాందేవ్ రావు ఆసుపత్రి బాధ్యత సమాజం లో మరింత పెరిగిందని, రోగులను మరింత జాగర్తగా, భద్రంగా, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని రంతిదేవ్ రావు మీరా రావు విక్రందేవ్ రావు జ్యోతి రావు విజయలక్ష్మి ,పృథ్వీరెడ్డి భారతి రెడ్డి ,విష్ణువర్ధన్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి అపర్ణ రావు,జివి రమణ తెలిపారు. ఈ కార్యక్రమం లో సి ఈ ఓ డాక్టర్ యన్ యోబు డాక్టర్స్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.