జనం న్యూస్,జనవరి 28,అచ్యుతాపురం:
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ రాంబిల్లి మండలం పూడి పరిధిలో ఉన్న హైటెక్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు కంపెనీ గేట్ ముందు ధర్నా చేపట్టారు.స్థానికులకు నెలలో పని పూర్తిగా కల్పించకుండా 15రోజుల మాత్రమే కంపెనీ వారు పని కల్పిస్తున్నారని, రోజుకి 12గంటలు పనిచేస్తున్నప్పటికీ కూడా ఉదయం 7గంటలు లోపు వచ్చిన వారిని మాత్రమే కంపెనీలో విధులకు పంపించి మిగతా వారిని ఇంటికి పంపించేస్తున్నారని,కంపెనీ యాజమాన్యం వారు పనికి తగ్గ వేతనం కల్పించి కంపెనీలో పూర్తిస్థాయిలో పనులు కల్పించాలని కార్మికులు కోరుతున్నారు.



