Listen to this article

జనం న్యూస్‌ 28 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

బంగ్లాదేశ్లోని బాగర్ హట్ జైలు నుంచి 23 మంది భారతీయ మత్స్యకారులను ఆ దేశ ప్రభుత్వం విడుదల చేసింది. వీరిలో 9 మంది విజయనగరం జిల్లాకి చెందిన వారు ఉన్నారు. భారత్-బంగ్లా అధికారుల సమన్వయంతో విడుదల ప్రక్రియ పూర్తయ్యింది. అవసరమైన డాక్యుమెంటేషన్ను ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు జానకిరామ్ పూర్తి చేశారు. మత్స్యకారులు కుటుంబాలతో మాట్లాడి భావోద్వేగానికి గురయ్యారు.