Listen to this article

జనం న్యూస్ 28 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

“తల్లిదండ్రులే ఫిర్యాదు చేయాలి” అని సమాధానం చెప్పడం ఎంత వరకు సమంజసం? పిల్లలు స్కూల్‌లో చదువుతుంటే తల్లిదండ్రులు బయటకు వచ్చి ఫిర్యాదు ఎలా చేస్తారు పిల్లల హక్కుల పరిరక్షణ అంటే ఇదేనా? చట్టాలపై అజ్ఞానమా? లేక స్కూల్ యాజమాన్యానికి ఇచ్చే మద్దతా? పిల్లలను క్లాస్ బయట నిలబెట్టడం పరీక్షలు రాయనివ్వకపోవడం పేరెంట్స్ రాలేదని వేధించడం ఇవన్నీ నేరాలే, “ఇంటర్నల్ మ్యాటర్” కాదు.బాధ్యతాయుతమైన అధికారులు నిర్లక్ష్యంగా మాట్లాడితే,స్కూల్ మాఫియాలకు అండగా నిలిచినట్టే ఇది దయ కాదు…ఇది బాధ్యత.ఇది వినతిపత్రం కాదు…ఇది హక్కుల పోరాటం.పిల్లల చదువుతో ఆటలాడితే చట్టం మౌనంగా ఉండదు.ప్రజలు, బాధ్యత కలిగిన ప్రతి పౌరుడు చూస్తూ ఊరుకోరు.