Listen to this article

జనం న్యూస్ జనవరి 28: నిజామాబాద్ జిల్లా

ఏర్గట్లమండలంలోసమగ్ర కుటుంబ సర్వే నిర్వహణలో పాల్గొన్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.10,000 పారితోషకం వెంటనే చెల్లించాలని పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడు కృష్ణ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఎంపీడీవో వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందజేశారు.
2024 నవంబర్‌లో ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి సర్వేను విజయవంతంగా పూర్తి చేసినప్పటికీ, దాదాపు సంవత్సరంనర గడుస్తున్నా పారితోషకం అందకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలస్యం వల్ల అసంతృప్తి పెరుగుతోందని పేర్కొంటూ, వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పారితోషకం విడుదల చేయాలని కోరారు.వినతి స్వీకరించిన ఎంపీడీవో త్వరితగతిన పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.