Listen to this article

జనం న్యూస్ జనవరి 28 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా

బీబీపేట మండలంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్సై విజయ్, ఆధ్వర్యంలో మంగళవారం ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. రోజువారీ జీవితంలో రోడ్డు వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు రోడ్డు ప్రమాదాలకు దారి తీసే నిర్లక్ష్యపు అలవాట్లు వాటిని ఎలా నివారించవచ్చో స్పష్టంగా అవగాహన కల్పించారు.
ప్రత్యేకంగా రోడ్డు పై నడిచేటప్పుడు ఏ వైపు నడవాలి, ఫుట్‌పాత్ లేనప్పుడు రోడ్డు ఎడమ వైపునే నడవాల్సిన అవసరం, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాల్సిన ప్రాముఖ్యతను వివరించారు. హెల్మెట్ సీట్‌బెల్ట్‌లు ప్రమాద సమయంలో ప్రాణాలను ఎలా కాపాడుతాయో ఉదాహరణలతో ఎస్సై విజయ్, సూచించారు.