జనం న్యూస్, జనవరి 28,అచ్యుతాపురం
కూటమి ప్రభుత్వం పేదలకు వరమని భావించాలని శాసన సభ్యులు సుందరపు విజయకుమార్ అన్నారు.బుధవారం జడ్పీ గెస్ట్ హౌస్ లో గల ఎమ్మెల్యే ఛాంబర్లో ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమంలో 9 మంది బాధితులకు రూ.2 లక్షల 20వేలు సీఎం రిలీప్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు.అనంతరం విజయకుమార్ మాట్లాడుతూ పేద ప్రజలు కష్టాలు జనవాణి కార్యక్రమంలో తెలిపిన వెంటనే సంబంధిత అధికారితో సమస్యలు తీరుస్తూ,నిరంతరం అందరి శ్రేయస్సు కోరేది కూటమి ప్రభుత్వం అని విజయకుమార్ అన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు,కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.


