జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 28 సెల్ 9550978955
సామాజిక సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి నివాళులు అర్పించిన అఖిల భారతీయ కోలీ ముదిరాజ్ (సమాజ్) నాయకులు
ఘనంగా జరిగిన అఖిల భారతీయ కోలీ ముదిరాజ్( సమాజ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి కార్యవర్గ సమావేశం
నూతనంగా రాష్ట్ర, జిల్లా,నియోజకవర్గ, మండల కమిటీల నియామకం
విజయవాడ హనుమాన్ పేట సాయి కృష్ణ తేజ ఫంక్షన్ హాల్ లో 2026 జనవరి 26న సోమవారం అఖిల భారతీయ కోలీ ముదిరాజ్ (సమాజ్ ) తొలి కార్యవర్గ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ముదిరాజ్ నాయకులు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధులు వారి జీవితాలను ప్రాణాలను లెక్కచేయకుండా దేశం కోసం వారు చేసిన త్యాగాలను గుర్తుకు చేశారు. సమావేశ ప్రారంభంలో సామాజిక సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అఖిల భారతీయ కోలీ ముదిరాజ్ (సమాజ్ )జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు రూటుం భూపతి ముదిరాజ్ , అతిథులుగా అఖిల భారతీయ కోలి ముదిరాజ్ (సమాజ్ )కర్ణాటక రాష్ట్ర అధ్యక్షులు దత్తాత్రేయ రెడ్డి ముదిరాజ్,అఖిల భారతీయ కోలీ ముదిరాజ్ (సమాజ్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కె.హనుమంతరావు ముదిరాజ్ మరియు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటనారాయణ ముదిరాజ్ అశోక్ రాందాస్ ముదిరాజ్, యస్. రాజేంద్ర ముదిరాజ్ పాల్గొన్నారు. అఖిల భారతీయ కోలి ముదిరాజ్ (సమాజ్)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ప్రముఖ హైకోర్టు న్యాయవాది వి.గురునాథం ముదిరాజ్ , మరి ముఖ్యంగా అఖిల భారతీయ కోలీ ముదిరాజ్ (సమాజ్ )ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు దూడం రెడ్డి బాబు ముదిరాజ్, అఖిల భారతీయ కోలీ సమాజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నెబోయిన రామకృష్ణ ముదిరాజ్, అఖిల భారతీయ కోలిముదిరాజ్ (సమాజ్)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు రామన బోయిన నాగేశ్వరి (అసిస్టెంట్ ప్రొఫెసర్)ముదిరాజ్ లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ కోలి ముదిరాజ్ (సమాజ్ ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వెంకట బుల్లోడు ముదిరాజ్, అఖిల భారతీయ కోలి ముదిరాజ్ (సమాజ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన అధ్యక్షులుగా కిలా బాలకృష్ణ ముదిరాజ్, అఖిల భారతీయ కోలీ ముదిరాజ్ (సమాజ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిలుగా మేకల రామ కోటేశ్వరరావు ముదిరాజ్, తూము శ్రీనివాసరావు ముదిరాజ్, వంకర బోయిన కృష్ణ మూర్తి ముదిరాజ్ ని మరియు జిల్లా, నియోజకవర్గ మరియు మండలాల నూతన కమిటీలకు సభ్యులను నియమించి వారికి నియామక పత్రాలు అందజేశారు.ముదిరాజ్ నాయకులు నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ జాతి అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.పలువురు రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ముదిరాజులు చాలా వెనకబడి ఉన్నారని వారి యొక్క హక్కులను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బీసీ-డి లో వున్నా ముదిరాజ్ లను బీసీ -ఏ లోకి మర్చి ముదిరాజుల అభివృద్ధికి తోడ్పడాలని డిమాండ్ చేశారు. అలాగే పలువురు జాతీయ ముదిరాజ్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ముదిరాజులకు చాలా కాలం నుంచి అన్యాయం జరుగుతుందని వారికి రావాల్సిన హక్కులను ఈ ప్రభుత్వాలు కూడా అమలు చేయడం లేదని వారికి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే జనగణను చేపట్టి 30 లక్షల పై చిలుకున్న ముదిరాజులకు జనాభా తమాషా ప్రకారం ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు కేటాయించాలని మరియు ముదిరాజ్ కార్పొరేషన్ ను తక్షణమే ఏర్పాటు చేసి సరియైన న్యాయం చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యవర్గ సమావేశ కార్యక్రమం లో పెద్ద సంఖ్యలో ముదిరాజులు పాల్గొన్నారు.


