బిచ్కుంద జనవరి 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా
జుక్కల్ నియోజక వర్గంలో బిచ్కుంద మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. బిచ్కుంద ప్రభుత్వ హైస్కూల్ లో మున్సిపల్ నామినేషన్ స్వీకరణ కేంద్రం లో ఏర్పాటు చేశారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి బిచ్కుంద మున్సిపల్ ఎన్నికల నామినేషన్ సెంటర్ ఏర్పాట్లను పరిశీలించినారు. బిచ్కుంద మున్సిపల్ పరిధిలో 12 వార్డులు గాను మూడు వార్డులకు ఒక నామినేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. మొత్తం 12 వార్డు గాను 4 నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినారు.ఈ నామినేషన్ ప్రక్రియ 3 రోజులపాటు కొనసాగుతుంది. మున్సిపల్ అధికారులు నామినేషన్ కేంద్రం వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. నామినేషన్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాన్సువాడ డి.ఎస్.పి నామినేషన్ సెంటర్ ను పరిశీలించినారు. మున్సిపల్ కమిషనర్ షేక్ హయ్యూమ్ మాట్లాడుతూ ఎన్నికల పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ కు ఎలాంటి ఆటంకం కలవకుండా అన్ని ఏర్పాట్లు చేసినామని తెలిపారు మొదటి రోజు నామినేషన్ మూడు వచ్చాయి . ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో వేణుగోపాల్, డిప్యూటీ ఎమ్మార్వో భారత్, సీఐ రవికుమార్ ఎస్సై రాజు మరియు రిటర్నింగ్ అధికారులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




