Listen to this article

జనం న్యూస్ జనవరి 28: జగిత్యాల జిల్లా

మెట్పల్లి మండలం:గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మెట్పల్లి వాసి శ్రీరాముల నారాయణ స్వామికి డాక్టరేట్ అవార్డు లభించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో ఎస్.జె.డబ్ల్యూ.హెచ్.ఆర్.సి (సామాజిక న్యాయ ప్రపంచ మానవ హక్కుల సంఘం) ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ పురస్కారం ప్రధానం చేశారు. అమెరికన్ విస్డం పీస్ యూనివర్సిటీ శ్రీరాముల నారాయణ స్వామి గారి సేవలను గుర్తించి ఈ డాక్టరేట్ అవార్డును అందజేశారు.మారుమూల ప్రాంతాల్లో దాదాపు 45 సంవత్సరాల పాటు వైద్య సేవలు అందిస్తూ అనేకమందికి ప్రాణదానం చేసినందుకు ఈ గౌరవం దక్కింది.ఈ అవార్డును నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ మాలెపు నారాయణ చేతుల మీదుగా అందజేశారు.ఈ కార్యక్రమంలో మెట్టుపల్లి డివిజన్ ఇంచార్జి (విశ్వ సమయం) కూడా పాల్గొన్నారు.