Listen to this article

జనం న్యూస్‌ 29 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

“మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుమారుడు పృథ్వీ పేకాట ఆడుతూ… అడ్డంగా దొరికిపోయినట్లు’ వైసీపీ ఆరోపించింది. శంబర పోలమాంబ జాతరలోని అమ్మవారికి మంత్రితో కలిసి పట్టువస్తాలను సమర్పించిన కొద్ది నిమిషాలకే బహిరంగంగా వెలుగులోకొచ్చిన ఈ దృశ్యాలను వైసీపీ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది. ‘చంద్రబాబు హయాంలో ఏపీని ‘పేకాటాంధ్రప్రదేశ్‌’గా మార్చారని, టీడీపీ నేతలే ఇలా ప్రజల జీవితాలతో ఆటలాడుతున్నారని’ విమర్శించింది.