Listen to this article

జనం న్యూస్‌ 29 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

ఈ నెల 25న పాతరేగలో యాసర్ల సింహాచలం (70)ను చేతులతో కొట్టి హత్య చేసిన ఘటనలో నిందితుడు పెద్దింటి తిరుపతిని బుధవారం అదుపులోకి తీసుకున్నట్లు బొబ్బిలి రూరల్‌ సీఐ నారాయణరావు వెల్లడించారు. మృతుడు సింహాచలం వద్ద నిందితుడు రూ.400లు అప్పుగా తీసుకున్నాడు. వాటిని ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ దాడికి దారితీసింది. ఈ ఘటనలో సింహాచలాన్ని తిరుపతి తోసివేయడంతో కుళాయి దిమ్మెపై పడి మృతి చెందాడు.