Listen to this article

జనం న్యూస్ 29 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా మాజీ అధ్యక్షులు .రామచంద్రారెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణం లో ఎన్నికల సందర్బంగా,బేబాకీ (నో డివ్) సర్టిఫికెట్ అభ్యర్థులకు సంబందించి ఇంటి పన్ను,కొళాయి పన్ను కట్టినా నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఇవ్వకుండా కాలయాపన చేసూన్నారు అని బిజెపి జిల్లా మాజీ అధ్యక్షులు ఎస్ రామచంద్ర రెడ్డి మండిపడ్డారు.మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ కు సమయం రెండు రోజులే సమయం ఉండడంతో ప్రతిపక్షా అభ్యర్థులకు మున్సిపల్ అధికారులు మొండి చేయి చూపిస్తున్నారని వారు అన్నారు.అధికార పార్టీ కి వత్తాసు పలుకుతున్నా అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో తీవ్ర ఆందోళన చేస్తామని వారు అన్నారు..ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు… ఈ కార్యక్రమం లో కంపాటి భగత్ రెడ్డి, మేడికొండ భీమ్ సేన్ రావు, నరసింహ శెట్టి, అశోక్ ప్రతీప్, నర్సింహా రాఘవేంద్ర ఆచారి, హేమావతి, నాగమ్మ, భీమన్న, రాజశేఖర్ తదితరులు పాలుగోన్నారు