జనం న్యూస్ 29 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి. బాసు హనుమంతు నాయుడు మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్.కేశవ్ ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గద్వాల టౌన్ మున్సిపల్ బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల మొదటి జాబితాను డా.ఆంజనేయులు గౌడ్,బాసు హనుమంతు నాయుడు,బిఎస్ కేశవ్ అధికారకంగా ప్రకటించారు…ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..దేశంలో నడుస్తున్న రాజకీయం ఒకటైతే గద్వాలలో నడుస్తున్న రాజకీయం ఒకటి.గద్వాలలో కాంగ్రెస్,బిజెపి ఒకటే. పార్టీ గుర్తులు వేరు అయినప్పటికీ గద్వాల మున్సిపాలిటీలో పోటీచేసే అభ్యర్థుల గూడు కూడ ఒకటే.మూడు, నాలుగు సర్వే రిపోర్ట్ లలో 37 వార్డులు బి ఆర్ యస్ పార్టీ కైవసం చేసుకుంటున్నాం.క్రిష్ణమోహన్ రెడ్డి, భరతసింహారెడ్డి నిలబెడుతున్న అభ్యర్థుల ఆశలు గల్లంతు అవబోతున్నాయి.వాళ్ళ దగ్గర మూటలుండొచ్చు,ముఠాలు ఉండొచ్చు, మా దగ్గర అలాంటి వాళ్ళు లేరు అని అన్నారు.అందరం ఐక్యంగా ఉండి ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ జెండాను ఎగురవేసి, కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్దామని వారు పిలుపునిచ్చారు. గద్వాల మున్సిపాలిటీలోని వార్డ్ ల బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపుకు ప్రతి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టపడాలని సూచించారు… గద్వాల మున్సిపల్ గడ్డపై గులాబీ జెండా ఎగరవేసి,కేసీఆర్ కేటీఆర్ కి బహుమతి ఇవ్వాలని అని అన్నారు..ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్‌ను ఇంటికి సాగనంపి, కేసీఆర్‌ను మళ్లీ సీఎంను చేయడానికి తెలంగాణ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు..మొదటి విడత అభ్యర్థుల జాబితా 17వార్డులు 2(జనరల్ మహిళ)-కర్నూల్ దివ్య 5(జనరల్)-చిన్న సంటెన్న 8(బీసీ మహిళ)-జయమ్మ 10(జనరల్ మహిళ)-చాంద్ బీ 12(జనరల్ మహిళ)-లత 14(జనరల్)-రాజ్ కుమార్ 16(జనరల్ మహిళ)-జీ. శశిరేఖ 24(జనరల్)-రియాజ్ 27(ఎస్టీ)-విజయలక్ష్మి 28(జనరల్)-కళావతి
29(బీసీ జనరల్)-శ్రీనివాస్ రెడ్డి 30(బీసీ జనరల్)-విజయకుమార్ 31(ఎస్సీ-మహిళ)-ప్రభావతి 32(జనరల్ మహిళ)రేణుక 33(బీసీ మహిళ)-స్వేత 36(జనరల్ మహిళ)-సునీత 37(బీసీ మహిళ)-మంజులా రాణి ఈ కార్యక్రమంలో పటేల్ జనార్దన్ రెడ్డి,కోటేష్,బీచుపల్లి,యూసఫ్,శ్రీరాములు,ఎండి మాజ్,ముజీబ్,నరసింహులు,రవి మరియు టౌన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…..


