1000 మందికి పైగా ఉచిత పరీక్షలు, మందుల పంపిణీ
జనం న్యూస్ జనవరి 29 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అనకాపల్లి 140 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ గౌరీ పరమేశ్వరుల మహోత్సవ రాజం పురస్కరించుకుని కిమ్స్ ఐకాన్ హాస్పిటల్స్ వారు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో దాదాపు వెయ్యి మందికి పైగా ఉచితంగా పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. గురువారం గవరపాలెంలోని మళ్ళా జగన్నాధం కళ్యాణ మండపం, పార్క్ సెంటర్ లో జరిగింది. ఈ శిబిరంలో జనరల్ మెడిసిన్, ఊపిరితిత్తుల వ్యాధులు, ఎముకలు & కీళ్ళ వైద్య నిపుణులు, ప్రసూతి & స్త్రీ వైద్య నిపుణులు, గుండె సంబంధిత వ్యాధులు,లివర్ (కాలేయం) సంబంధిత వ్యాధులు, కంటి సంబంధిత వ్యాధులు వంటి విభాగాలకు చెందిన అనుభవజ్ఞులైన వైద్యులు పాల్గొని ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించారు.అంతేకాకుండా బీపీ (రక్తపోటు), షుగర్ వ్యాధి / మధుమేహం, ఊపిరితిత్తుల పనితీరు పరీక్ష (పల్మనరీ ఫంక్షన్ టెస్ట్), కాలేయ సంబంధిత పరీక్షలు, మామోగ్రఫీ (రోమ్ములకు సంబంధించిన ఎక్స్-రే), బిఎండి (ఎముకల సాంద్రత పరీక్ష), కంటి చూపు పరీక్షలు ఉచితంగా చేశారు.ఈ మెగా వైద్య శిబిరంని కిమ్స్ ఐకాన్ మెనజింగ్ డైరెక్టర్ డా. పి సతీష్ కుమార్ ప్రారంభించారు.మరియు డాక్టర్ గోపాలరాజు, మెడికల్ డైరెక్టర్, ఆర్ సీఈవో డాక్టర్ నగేష్, ఉత్సవ కమిటీ చైర్మన్ కొణతాల జగన్నాధరావు నాయుడు, కొణతాల సంతోష్ అప్పారావు నాయుడు,కొణతాల ప్రసాద్, కొణతాల మురళీ కృష్ణ,కొణతాల ఇందిర, కొణతాల మహాలక్ష్మి నాయుడు, కె ఎన్ వి సత్యనారాయణ, పి.వి రమణ,దాడి కృష్ణ, సూరిశెట్టి నర్సింగరావు, కొణతాల జయకుమార్, గండేపల్లి మురళీ,పీలా శ్యాం,డా. కొణతాల జగ్గారావు
పాల్గొన్నారు.//


