జనం న్యూస్ జనవరి 29 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
కాట్రేనికోన గ్రామ పంచాయతీ పరిధిలోని బ్రహ్మన్న చెరువు గ్రామంలో పలువురు చిన్నారులు అనారోగ్యంతో జ్వరం, వాంతులు, విరేచనాలకు గురై కోలుకుంటుండగా ఈ విషయం తెలుసు కున్న సర్పంచ్ గంటి వెంకట సుధాకర్ పంచాయతీ సిబ్బందిచే వెంటనే శానిటేషన్ చేయించారు.అలాగే కాట్రేనికోన వేట్లపాలెం ప్రధాన రహదారిపై బ్రహ్మన్న చెరువు గ్రామం వద్ద మురుగునీరు కొద్ది రోజులుగా ప్రవహిస్తుండడంతో ఆ నీటిని సెప్టిక్ ట్యాంకర్ ద్వారా తోడించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. అయన చేస్తున్న సేవలను పలువురు గ్రామస్తులు కొనియాడారు.


