Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 29 సెల్ 9550978955

ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక హామీల అమలు కొరకై ఎస్టీయు చేపట్టిన దశల వారి ఉద్యమంలో భాగంగా రేపు అనగా జనవరి 30వ తేదీన మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరశన, తహసీల్దార్ కి వినతిపత్రాన్ని అందించే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎస్టియు రాష్ట్ర ఆర్థి కార్యదర్శి కే కోటేశ్వరరావు ఎస్టియు రాష్ట్ర డైరీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావులు కోరారు. ఈరోజు చిలకలూరిపేట పట్టణంలోని ఎస్ టి యు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్టీయు రాష్ట్ర సంఘం రూపొందించిన ఎస్ టి యు ఉద్యమ కార్యచరణ కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ప్రతి ప్రాథమిక, ఉన్నత పాఠశాలకు మరియు మోడల్ ప్రైమరీలోని ప్రతి ఉపాధ్యాయుడు బాధ్యత తీసుకోవాలని ఉద్యమానికి ఉపాధ్యాయులను సిద్ధం చేసేలా చైతన్యపరచాలని మన హక్కుల సాధనలో భాగంగా ఎస్టీయు ఆధ్వర్యంలో వేస్తున్న తొలి ఉద్యమ అడుగులు బలంగా పడేలా ఎస్టీయు నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని తెలిపారు. ప్రధాన డిమాండ్లు
12 వ పిఆర్సి కమిషనర్ ఏర్పాటు 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలి ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో వున్న ఆర్థిక బకాయిలు,4 DA లు ప్రకటించాలి సీపీ యస్ రద్దు పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలను విడుదల.
ఉపాధ్యాయులను బోధనేతర పనులు తప్పించాలిఈ సమావేశంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షులు బొంత రవి, ఉపాధ్యక్షులు యం, శారద, రాష్ట్ర కౌన్సిలర్ విజయ్ కుమార్ పట్టణ అధ్యక్షులు మేకల కోటేశ్వరరావు వడ్లాన జయప్రకాష్. నాదెండ్ల మండల అధ్యక్షులు షేక్ మక్బూల్ బాషా ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్ చిలకలూరిపేట మండల అధ్యక్షులుషేక్ మస్తాన్ వలి కార్యదర్శి వి రమణా నాయక్ ఎడ్లపాడు మండల అధ్యక్షులు జి కోటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ ఎస్ టి యు సీనియర్ నాయకులు చావల మల్లేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.