Listen to this article

జనం న్యూస్‌ 30 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ అధ్యక్షులు సి హెచ్. రమణ శుక్రవారం ఉదయం అయ్యన్నపేట జంక్షన్ వద్దనున్న మున్సిపల్ నడకమైదానంలో ఘనంగా నిర్వహించారు.ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ ఎ​గాంధీజీకి అంజనీపుత్ర వాకర్స్ క్లబ్ ఘన నివాళి: స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో పారిశుధ్య కార్మికులకు సత్కారం.తిరుపతి రావు, క్లబ్ పెద్దలు శ్రీ సింహాగిరి విద్యాసంస్థల అధినేత శ్రీ సింహాగిరి పట్నాయక్ పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం గాంధీ మహాత్మునికి ఎంతో ఇష్టమైన “శుభ్రతను పాటిస్తూ.. పరిసరాలను శుభ్రపరచడంపై”ప్రజల్లో అవగాహన కోసం “స్వచ్ భారత్” కార్యక్రమాన్ని నడక మైదానంలో చేపట్టి, పేరుకుపోయిన చెత్తచెదారాన్ని ఏరివేసి, వయ్యారిభామ, నిద్రగన్నేరు వంటి పిచ్చిమొక్కలను తీసివేశారు.ఈ సందర్బంగా డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ ఎ. తిరుపతి రావు మాట్లాడుతూ అహింసే ఆయుధంగా మలుచుకొని ఏదైనా సాధించవచ్చని నిరూపించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని, స్వరాజ్యసాధనకు అహింస అనే ఆయుధాన్ని వాడి ప్రపంచానికి దాని ప్రాధాన్యతతను చాటిచెప్పిన ధీశాలి మహాత్మా గాంధీ అని, ఒక్క భారతదేశానికే కాక యావత్తూ ప్రపపంచానికే స్ఫూర్తి ప్రధాతని, బాపూజీ సేవలనుగూర్చి కొనియాడారు. మృతువీరుల స్మారకదినోత్సవం కావడంతో క్లబ్ సభ్యులంతా రెండునిమిషాలు మౌనం పాటించారు.కార్యక్రమంలో చివరిగా పలువురు పారిశుధ్య కార్మికులకు నూతన వస్త్రములతో డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ ఎ. తిరుపతి రావు,క్లబ్ గౌరవ అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు (బాలు), శ్రీ సాయికృష్ణ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు వల్లూరి శ్రీనివాస్,డిప్యుటీ గవర్నర్ తాడ్డి ఆదినారాయణ, క్లబ్ పెద్దలు కోట్ల సత్యనారాయణ, జె.వి.ఎస్. ప్రసాద్,ఐ. వి. ప్రసాదరావు,కె. రమేష్, జాలీ వాకర్ వై. నలమహారాజు,క్లబ్ కార్యదర్శి కోట్ల ఈశ్వరరావు, ఉపాధ్యక్షలు పి.అప్పలరాజు, జాయింట్ సెక్రటరీ ఇందుకూరి అప్పలరాజు,యోగా గురువు ఎస్. చక్రధర్ పట్నాయక్, ఆర్. సి. హెచ్. అప్పలనాయుడు, పిన్నింటి లక్ష్మణరావు,పాత్రుడు చేతులమీదుగా సత్కరించారు.