Listen to this article

జనం న్యూస్‌ 30 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

26-1-2026 రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వ పరంగా ఉత్తమ ఉద్యోగుల అవార్డు గ్రహీతలు అయిన బి సి వెల్ఫేర్ ఉద్యోగులు జానకి రావు, చంద్రశేఖర్, యశోదలకు మన సంఘం తరపున ఈరోజు విజయనగరం ఎ బి సి డివిజనల్ అధికారి కార్యాలయం ఆవరణలో రాష్ట్ర చైర్మన్ మరియు జిల్లా అధ్యక్షులు శొంఠి కామేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సన్మానించడమైనది. సమావేశంలో సంఘం ఉపాధ్యక్షులు కె వి రమణ, జిల్లా ట్రెజరర్ జి కుమారస్వామి, సీనియర్ నాయకులు అప్పలరాజు, డివిజనల్ అధికారి కిష్ణ, విజయనగరం అర్బన్ డివిజినల్ అధికారిణి రాజులమ్మ ప్రసంగించిరి. ఈ సమావేశమునకు విజయనగరం జిల్లా సంఘ నాయకులు, జిల్లా అధ్యక్షులు విజయ కుమార్, జిల్లా శక్రటరీ గౌరీ పతి, జాయింట్ సెక్రటరీ బొట్టా ఆనంద్, పి అలివేలుమంగ, జిల్లా స్టీరింగ్ కమిటీ మెంబర్ లు కె లచ్చారావు, అప్పల నర్సయ్య, బి సత్యారావు, సుశీల, జొన్నవలస హెచ్ డబ్ల్యు ఓ అధికారిణి హాజరైరి.