Listen to this article

జనం న్యూస్ జనవరి 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం గూడెప్పాడ్ సెంటర్ కు సమీపంలో గల యం యం మార్ట్ లో వరంగల్ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు పోలీసు వారు తనిఖీలు చేసి, దాదాపు 40 కిలోల నకిలీ టీ పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఫుడ్ సేఫ్టీ అధికారులు కృష్ణమూర్తి మౌనిక నకిలీ టీ పౌడర్ ను ఎలా గుర్తించాలో డెమో చేసి చూపించినారు.
ఈ కార్యక్రమంలో పరకాల రూరల్ సీ.ఐ. రంజిత్ రావు , శాయంపేట ఎస్సై జక్కుల పరమేశ్వర్ , దామెర ఎస్సై కొంక అశోక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.