జనం న్యూస్ జనవరి 31 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అనకాపల్లి,సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు కొత్త దారుల్లో ప్రజలను నిలువునా దోచుకుంటున్నారని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ‘ట్రాఫిక్ చలాన్ల’ పేరుతో జరుగుతున్న మోసాల పట్ల ప్రజలు అత్యంత జాగ్రత్తగా* ఉండాలని ఆయన సూచించారు.నకిలీ ట్రాఫిక్ చలాన్ల మోసం మీ వాహనానికి పెండింగ్ చలాన్ ఉందని, వెంటనే ఈ లింక్ క్లిక్ చేసి చెల్లించకపోతే మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందని నేరగాళ్లు మెసేజ్‌లు పంపిస్తున్నారు.
నిజమైన అధికారిక చలాన్ మెసేజ్‌లు ఎప్పుడూ.gov.in వెబ్సైట్ లను చూడాలన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ వాట్సాప్ నెంబర్: 95523 00009* లేదా ఫోన్ పే, పేటీఎం తదితర..* వాటి ద్వారా ట్రాఫిక్ చలాన్ లను చెల్లించవచ్చు.జాగ్రత్త: గుర్తు తెలియని లింక్‌లను క్లిక్ చేసి డబ్బులు చెల్లించకండి. అధికారిక ‘ఏపీ ఈ-చలాన్’ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా మాత్రమే తనిఖీ చేసుకోండి అని సూచించారు.కొత్తగా వస్తున్న ఇతర సైబర్ ముప్పులు పాత పద్ధతులే కాకుండా, ప్రస్తుతం నేరగాళ్లు వాడుతున్న సరికొత్త మార్గాలు ఇవే:
డిజిటల్ అరెస్ట్ (Digital Arrest):మీరు డ్రగ్స్ లేదా మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్నారని, సిబిఐ లేదా పోలీస్ అధికారులమని చెబుతూ వీడియో కాల్ చేస్తారు. గంటల తరబడి మిమ్మల్ని వీడియో కాల్లో ఉంచి భయపెట్టి లక్షలాది రూపాయలు వసూలు చేస్తారు. గుర్తుంచుకోండి, ఏ ప్రభుత్వ సంస్థ వీడియో కాల్లో అరెస్టులు చేయదు.స్క్రీన్ షేరింగ్ యాప్స్ కస్టమర్ కేర్ పేరుతో ఫోన్ చేసి ఎనీ డెస్క్ లేదా టీం యువర్ వంటి యాప్స్ ఇన్స్టాల్ చేయమని అడుగుతారు. దీనివల్ల మీ ఫోన్ వారి ఆధీనంలోకి వెళ్లిపోతుంది.
పెడ్ రివ్యూ స్కామ్స్ పార్ట్ టైం జాబ్ యూట్యూబ్ వీడియోలను లైక్ చేస్తే లేదా గూగుల్ మ్యాప్స్‌లో రేటింగ్ ఇస్తే డబ్బులు ఇస్తామని ఆశ చూపి, మెల్లగా మిమ్మల్ని ఇన్వెస్ట్మెంట్ పేరుతో పెద్ద మొత్తంలో మోసం చేస్తారు.
లింక్‌లపై క్లిక్ చేయకండి: ఫోన్ కి వచ్చే అనుమానాస్పద లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు. బ్యాంకు అధికారులు లేదా ప్రభుత్వ అధికారులు ఎవరూ మీ ఓటిపిని అడగరని గుర్తించండి.వ్యక్తిగత సమాచారం: మీ ఆధార్, పాన్ కార్డ్ ఫోటోలను గుర్తుతెలియని వ్యక్తులకు పంపకండి.మీరు సైబర్ మోసానికి గురైనట్లయితే,* మొదటి రెండు గంటలు గోల్డెన్ అవర్ చాలా కీలకం. వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు నమోదు చేయండి అని ఎస్పీ తెలిపారు.//


