Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 31

ఈరోజు ఎస్ టి యు (రాష్ట్రోపాధ్యాయ సంఘం) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల సమస్యలపై ఉద్యమ కార్యాచరణలో మొదటి దశలో భాగంగా తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లి విజ్ఞాపన పత్రాన్ని అందజేయడం జరిగింది. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఎదురుచూసినప్పటికీ నిరాశే ఎదురవుతున్నది. ఉద్యోగ, ఉపాధ్యాయ,పెన్షనర్లలో ఉన్న ఆందోళన ను అసంతృప్తిని తెలియజేయుట కొరకు జనవరి 30న మండల తాసిల్దార్లకు వినతి పత్రాలు సమర్పణ,ఫిబ్రవరి 10న అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా,ఫిబ్రవరి 25న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నిర్ణయించింది. జనవరి 30 తేదీ ఈరోజు తర్లుపాడు మండలం ఎస్ టి యు అధ్యక్షులు కసెట్టి జగన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మండల తాసిల్దార్ కార్యాలయం లో అందుబాటులో ఉన్న అధికారి జూనియర్ అసిస్టెంట్ ఉదయశ్రీ కి విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడం జరిగింది.మా డిమాండ్లు 1) 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి. 30 శాతం మధ్యతరగతి మంజూరు చేయాలి.2) ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు చెల్లించవలసిన ఆర్థిక బకాయిల వివరాలు పే స్లిప్పులు తెలిపి వెంటనే చెల్లించుటకు చర్యలు తీసుకోవాలి.3) సిపిఎస్ రద్దు అంశంపై వెంటనే నిర్ణయం తీసుకొని పాత పెన్షన్ విధానం అమలు చేయాలి.4) ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు చెల్లించవలసిన నాలుగు డీఏలను వెంటనే మంజూరు చేయాలి.ఈ కార్యక్రమంలో ఎస్టియు అధ్యక్షులు కసెట్టి జగన్ బాబు,ప్రధాన కార్యదర్శి షేక్ నజీర్ అహ్మద్ ఆర్థిక కార్యదర్శి సాదు అంజని కుమార్, ఉపాధ్యాయులు చినమనగొండ శ్రీనివాసులు, బొప్పరాజు శ్రీనివాసులు, జెల్లి శ్రీనివాసులు, మేడ బలిమి, జెల్లి.. శ్రీనివాసులు, తాడి లక్ష్మీనారాయణ, నాగేళ్ల పాల్, సురేంద్రబాబు,అబ్దుల్ సుకుర్, పొడతరపు. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు