

ఎమ్మెల్సీ చేతుల మీదుగా ఉగాది పురస్కారం ఆదుకున్నారు.
-భక్తుని మరణం తీరనిలోటు: రామకోటి రామరాజు
జనం న్యూస్, ఫిబ్రవరి 8, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్:- రామనామమే ప్రాణమని గత 25 సంవత్సరాలనుండి కోటికీ పైగా రామనామాలు లిఖించి సందర్బంగా గత సారి, ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, చేతుల మీదుగా రామకోటి భక్త సమాజం నుండి ఉగాది పురస్కారం అందుకున్నాడు. తిర్మాలాపూర్ గ్రామానికి చెందిన చిట్యాల వేణు శనివారం నాడు రోడ్డు ప్రమాదంలో అతను, అతని కుమారుడు మరణించడం, రామకోటి భక్త సమాజానికి తీరనిలోటు అని సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు తెలిపారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ వేణు గొప్ప రామభక్తుడు అని రామకోటి సంస్థ నుండి 5 సార్లు ఉగాది పురస్కారానికి ఎంపికయ్యాడని, అయన సేవలు రామకోటి సంస్థ ఎన్నటికీ మర్చిపోదు అన్నాడు. గత 25 సంవత్సరాలనుండి నిర్వీరామంగా 1కోటి 20లక్షల రామ నామాలు లిఖించిన గొప్ప భక్తుడన్నాడు.