Listen to this article

జనం న్యూస్: జనవరి 31 (కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా)

కొత్తగా జారీ చేసే ఫాస్టాగ్‌లకు నో యువర్‌ వెహికిల్‌ (కేవైవీ) తనిఖీ ప్రక్రియను పూర్తిగా తొలగిస్తున్నట్లు నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రకటించింది. వాహనం సమాచారాన్ని తనిఖీ చేయవలసిన పూర్తి బాధ్యత ఫాస్టాగ్‌ను జారీ చేసే బ్యాంకులదే. పాన్‌ మసాలా, సిగరెట్లు, పొగాకు సంబంధిత ఉత్పత్తులు ఫిబ్రవరి 1 నుంచి మరింత ప్రియం కానున్నాయి. వీటిపై కేంద్రం అధిక సుంకాలు విధించడమే కారణం. పాన్‌ మసాలాపై అదనంగా ఆరోగ్యం, దేశ భద్రతకు సంబంధించిన పన్నులను కూడా విధిస్తుంది.