

జనం న్యూస్: ఇనంది ఫిబ్రవరి శనివారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళి ఘణపూర్ నందు స్వయం స్వపరిపాలన దినోత్సవంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా ఒకరోజు విధులు నిర్వర్తించి అలరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరుణాకర్ మాట్లాడుతూ భవిష్యత్ లో ఏరంగంలో ఉన్న కలిసిసాగాలన్నారు. డిఇఓగా జశ్వంత్, ఎంఇఓగా యశ్వంత్ , హెచ్ ఎంగా మలేహ సుమారు వందమంది ఉపాధ్యాయులుగా పాఠాలు బోధించి, విధులు నిర్వర్తించారు. ఈ కార్యక్రమంలో ఏయంఓ సుదర్శనమూర్తి, ప్రధానోపాధ్యాయులు కరుణాకర్ ఉపాధ్యాయులు రాజశేఖర్, శ్యామల, దేవులా, ఉండ్రాళ్ళ రాజేశం, రవీందర్, మహేశ్వరచారి, మధుసూదన్, నల్ల అశోక్, బస్వరాజ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.