జనం న్యూస్ ఫిబ్రవరి 1 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి
కూకట్పల్లి బాలాజీ నగర్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆయన భక్తిశ్రద్ధలతో పాల్గొని శ్రీ వాసవి మాత దివ్యదర్శనం చేసుకొని అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు.
అనంతరం దేవాలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఆలయ కమిటీ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వేద పండితులు వేదాశీర్వచనాలు ప్రసాదించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మధుసూదన్, సంతోష్, రాజు,జగన్, సంజీవ్ కుమార్, సుబ్బయ్య తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.



