Listen to this article

జనం న్యూస్‌ 01 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

తిరుమల లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు కూటమి నేతలు చేసిన విష ప్రచారం పూర్తిగా అసత్యమని సిబిఐ విచారణలో తేలిపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మరియు విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పేర్కొన్నారు. భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్న కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆదేశాల మేరకు ఈరోజు చీపురుపల్లి, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు…అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిన్న శ్రీను మాట్లాడుతూ.. “చంద్రబాబు నాయుడు రాజకీయ స్వార్థం కోసం తిరుమల వేదికగా ఆడిన నాటకం బట్టబయలైంది. కోట్లాది మంది భక్తులు ఆరాధించే వేంకటేశ్వర స్వామిని, పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకోవడం అత్యంత నీచమైన చర్య. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇంతటి దుర్మార్గపు ప్రచారాన్ని ఎన్నడూ చూడలేదు,” అని మండిపడ్డారు..ముఖ్యాంశాలు:అసత్య ప్రచారం భగ్నం: చంద్రబాబు చేసిన దుష్ప్రచారాన్ని సాక్షాత్తు తిరుమల వేంకటేశ్వర స్వామియే తిప్పికొట్టారని, సుప్రీంకోర్టు వ్యాఖ్యలతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని డిమాండ్ చేశారు…భక్తుల మనోభావాలతో ఆటలా?: కేవలం రాజకీయ లబ్ధి కోసం భక్తుల సెంటిమెంట్లను దెబ్బతీస్తూ, పవిత్ర ఆలయ ప్రతిష్టను మసకబార్చేలా చంద్రబాబు వ్యవహరించారని విమర్శించారు..విచారణకు సిద్ధం: గత ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రతను కాపాడటంలో రాజీ పడలేదని, చంద్రబాబు అలవాటు ప్రకారం చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.