Listen to this article

జనం న్యూస్‌ 02 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

క్రీడలు చిన్నారుల్లో నాయకత్వ లక్షణాలు, బృంద నైపుణ్యాలను పెంపొందిస్తాయని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ అన్నారు. బీచ్ రోడ్డులోని రల్లా బెల్లా పాఠశాల శనివారం నిర్వహించిన వార్షిక క్రీడా దినోత్సవంలో ఆయన పాల్గొని చిన్నారులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ క్రీడలు పట్టుదల, క్రమశిక్షణ, సానుకూల దృక్పథాలను పెంపొందిస్తాయన్నారు. శారీరక దృఢత్వానికి, మనో వికాసానికి ఉపయోగకరంగా నిలుస్తాయన్నారు.ప్రిన్సిపాల్ సుభదర్శిని దలాయ్ మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడే విద్యా బోధనతోపాటు క్రీడలు, ఇతర సహపాఠ్య కార్యకలాపాలకు ప్రాధాన్యం కల్పిస్తున్న విధానాన్ని తెలియజేశారు. అతిథి సిబాసంకర్ దలాయ్ మాట్లాడుతూ చిన్న వయసు నుంచే శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో వివరించారు. అనంతరం చిన్నారులు పలు విన్యాసాలు చేసి ఆకట్టుకున్నారు.