జనం న్యూస్ ఫిబ్రవరి 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం ఈనెల 8వ తారీకు రోజున భూపాలపల్లి జిల్లా లో నిర్వహించే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దూదిపాల బుచ్చి రెడ్డి పిలుపునిచ్చారు. భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఆదేశానుసారం శాయంపేట మండల కేంద్రంలోని ఎస్వీకేకే ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ మండల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బుచ్చి రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సభకు జన సమీకరణ చేయడం కోసం మండల నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. నియోజకవర్గం లోనే శాయంపేట మండలం నుండి జనం అధిక సంఖ్యలో పాల్గొనే విధంగా చూడాలని సూచించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందని, పాత విధంగానే పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రతి గ్రామపంచాయతీ నుండి తీర్మానాలు చేసే విధంగా చొరవ తీసుకోవాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాసని చంద్రప్రకాష్ చల్లా చక్రపాణి, పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి, మారపల్లి రవీందర్, చిందం రవి, నిమ్మల రమేష్ హైదర్, అబ్బు ప్రకాష్ రెడ్డి, శానం జంగారెడ్డి మామిడిపల్లి సాంబయ్య సాదు నాగరాజు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచ్ లు , అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు…..


