జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 2
తర్లుపాడు: మండల కేంద్రమైన తర్లుపాడు గ్రామంలో వెలసిన శ్రీ రుక్మిణి సత్యభామసమేతవేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలకు రంగంసిద్ధమైంది.ఈఉత్సవాలకుసంబంధించినగోడపత్రాలను పోస్టర్లను మార్కాపురం ఎమ్మెల్యేకందులనారాయణరెడ్డి శనివారం ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవాలనుభక్తులందరూకలిసికట్టుగాజరుపుకోవాలని, ఈ వేడుకలు గ్రామానికి శుభం చేకూర్చాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధికి, ఉత్సవాల విజయవంతానికి అందరూ సహకరించాలనిఆయనకోరారు.ఈకార్యక్రమంలో ఈ ఓ ఈదుల చెన్న కేశవ రెడ్డి,ఆలయధర్మకర్తజవ్వాజివిజయభాస్కర రావు, గ్రామ పెద్దలు కొలగట్ల భాస్కర్ రెడ్డి,కొలగట్ల కాశీశ్వరరెడ్డి,ఈర్ల వెంకటయ్య కాళంగిపెద్దశ్రీనివాసులు,గోసువెంకటేశ్వర్లు, కుందురు చిన్న కాసిరెడ్డి, ఎర్వవెంకటరెడ్డి,జవ్వాజివెంకటేశ్వర్లు,కొలగట్ల గంగాధర్ రెడ్డి, కొలగట్ల కృష్ణారెడ్డి పాల్గొన్నారు


