Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 2 ముమ్మిడివరం ప్రతినిధి దక్షిణ కాశీగా

పేరుగాంచిన ప్రసిద్ధ కోనసీమశైవక్షేత్రం ” కుండలేశ్వరంలో గత 5 రోజులుగా జరుగుతున్నటువంటి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు మాఘ పౌర్ణమి ఆదివారం ” మహామాఘి ” పర్వదినం సందర్భంగా ఆలయంలో శేష హోమ, మహా పూర్ణాహుతి కార్యక్రమాలు పూర్తిచేసుకుని వృద్ధ గౌతమి నదీ తీరం నందు త్రిశూల స్నాన మహోత్సవం మరియు క్షేత్రపాలకుడైన వేణుగోపాల స్వామి చక్రస్నాన మహోత్సవములు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి సారధ్యంలో శైవాగమ విధానముగా టీటీడీ వార్షిక సత్కార పండితులు బ్రహ్మశ్రీ కాళ్లకూరి సూరిపండు శివాచార్య వారి బ్రహ్మత్వం లో అర్చకులు కాళ్ళకూరి కామేశ్వరరావు గారి పర్యవేక్షణలో అలాగే వేణుగోపాల స్వామి వారి చక్రస్నాన మహోత్సవాలు వైఖానస ఆగమ విధానముగా వైభవోపేతముగా నిర్వహించిరి . ఒకేసారి శివకేశవ త్రిశూల చక్రస్నాన మహోత్సవాల్లో పాల్గొనడం జన్మజన్మల అదృష్టం గా భావించి అక్కడికి వచ్చిన గ్రామస్తులు మరియు వందలాది యాత్రికులు ఈ త్రిశూల స్నాన చక్రస్నాన మహోత్సవాల్లో పాల్గొని తరించిరి…