జనం న్యూస్ ఫిబ్రవరి 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి వరంగల్ జిల్లా మాజీ జెడ్పిచైర్ పర్సన్& బిఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆదేశానుసారం…శాయంపేట మండల బిఆర్ఎస్ పార్టీ , మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని మాందారిపేట సెంటర్లోతెలంగాణ ఉద్యమ సారథి,ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి,రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడపించిన నాయకుడు,బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ సర్కార్ రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త నిరసనలకు మద్దతుగామాందారిపేట జాతీయ రహదారిపై నల్ల జెండాలు, బ్యాడ్జీలతో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన, ధర్నా, రాస్తారోకో చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూనోటీసుల పేరుతో ఇబ్బందులు పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక నోటీసుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలం గడుపుతున్నదని,ఆధారాలు లేని ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ పేరుతో డ్రామాలు చేస్తున్నారని, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి దుర్మార్గపు పాలనకు ప్రజలే అడ్డుకట్ట వేస్తారన్నారు. రైతుబంధు ఇవ్వలేక ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు.కేసీఆర్ కి సిట్ నోటీసులు ఇవ్వడం అంటే.. తెలంగాణ నేలను అవమానించటమేనని,ఉద్యమంలో ఎన్నో కేసులు ఎదుర్కొన్నాం, ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొన్నాం.ఎన్ని అక్రమ కేసులు వేసినా,ఎన్ని నోటీసులు ఇచ్చినా,ఏ తప్పు చేయలేదు, భయపడేది లేదు.తెలంగాణ ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటామన్నారు.జై తెలంగాణ జై కేసీఆర్. అంటు నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, గ్రామశాఖ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు ,యూత్ నాయకులు, సోషల్ మీడియా కన్వీనర్ లు, నాయకులు, కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు….


