జనం న్యూస్ ఫిబ్రవరి 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ
జిల్లాముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో గత 46 సంవత్సరాలగా శ్రీ వీరభద్ర స్వామి వారి తీర్థ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా గొలకోటి సాయిబాబు మాట్లాడుతూ దేవరపల్లి వాస్తవ్యులు మహాదశ చిట్టమ్మ వీరభద్ర పీఠం స్థాపించి ఎంతోమంది వీరులను గద్దెనెక్కించారు ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి రోజున తెల్లవారుజాము నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనేకమంది తమ వీరభద్రులను బ్రహ్మ గుండాల వద్దకు తీసుకొని వెళ్లి మేళ తాళాలతో స్నానమాచరించి పూజ నిర్వహించి పీఠం వద్దకు తీసుకువచ్చి గద్దె కు అప్పగిస్తారు గొలకోటి వెంకటరెడ్డి ఈ క్షేత్రంలో పూర్వం అగస్త్య మహాముని తపస్సు చేసినారని స్థల పురాణం తెలియజేస్తుందన్నారు అలాగే ఈ బ్రహ్మగుండాలలో స్నానం ఆచరించడం వలన పాపాలు తొలగి పుణ్యం సిద్ధిస్తుందని చర్మ సంబంధ వ్యాధులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం అన్నారు ఈ క్షేత్రంలో అప్పుడప్పుడు పెద్ద పెద్ద నాగసర్పాలు దర్శనమిస్తాయి వాటిని ఫోటో తీస్తే ఫోటో రాదు అని కొంతమంది భక్తులు తెలియజేశారు ఈ సందర్భంగా ఆలయం వద్ద భజన సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సాయంకాలం నిప్పుల గుండం తొక్కుట వీరభద్రుడు సంబరం చేయడం జరుగుతుందన్నారు ఇక్కడ నిర్వహించిన అన్న సమారాధన లో సమరసత సేవా ఫౌండేషన్ కార్యకర్తలు కాట్రేనికోన మండల కన్వీనర్ బి నాగలక్ష్మి ఆధ్వర్యంలో సేవలు అందించారు వారిని ఆలయ కమిటీ వారు అభినందించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గొలకోటి శివరామకృష్ణ ముమ్మిడివరం సబ్ డివిజన్ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు గోలకోటి వీరబాబు మట్ట సూరిబాబు మేకల నాగయ్య గాలిదేవర రమేష్ గొలకోటి సుబ్రమణ్యం గాలిదేవర సత్తిబాబు బద్రి దొరబాబు సుధా దొరబాబు గోలకోటి శ్రీనివాసరావు నంద్యాల తాతాజీ తదితరులు పాల్గొన్నారు



