టెంపుల్ నిర్మాణం అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉండటంపై బీసీ మైనారిటీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు
మమ్మద్ ఇమ్రాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు
జనం న్యూస్ 02 ఫిబ్రవరి .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీనగర్ ప్రజల చిరకాల కోరిక అయిన హనుమాన్ టెంపుల్ నిర్మాణం ఇప్పటివరకు పూర్తికాకపోవడం దురదృష్టకరమన్నారు. రాబోయే మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికల్లో గెలుపొందే కౌన్సిలర్ తప్పకుండా ఈ టెంపుల్ నిర్మాణ బాధ్యతను స్వీకరించి వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. ఆలయ నిర్మాణం పూర్తయితే గాంధీనగర్ ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక అవసరాలు తీరడమే కాకుండా ప్రాంతంలో ఐక్యత, శాంతి మరింత బలపడుతుందని తెలిపారు. ఇప్పటివరకు వచ్చిన ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం వల్లే టెంపుల్ నిర్మాణం పెండింగ్లో ఉందని విమర్శించారు. కనీసం ఈ ఎన్నికల తర్వాత అయినా గెలిచే కౌన్సిలర్ ప్రజల ఆకాంక్షలను గౌరవించి హనుమాన్ టెంపుల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని మమ్మద్ ఇమ్రాన్ గట్టిగా డిమాండ్ చేశారు. గాంధీనగర్ అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు బాధ్యతతో పని చేయాలని, ముఖ్యంగా ఆలయ నిర్మాణం విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి నందు స్వామి , పేర్ల చందు, ప్రదీప్, రాజు , రామ్ చందర్, కిరాణా, మధు శేఖర్, విజయ్, శ్రీనివాస్, కాలనీ యువకులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు


