Listen to this article

జనం న్యూస్‌ 03 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

ప్రేయసి అలిగిందని రైలు పట్టాలపై ఓ యువకుడు తలపెట్టిన ఘటన టెక్కలిలో ఆదివారం జరిగింది.పార్వతీపురానికి చెందిన యువతి, మెలియాపుట్టికి చెందిన యువకుడు ప్రేమలో ఉన్నారు. యువతిని కలవాలనుకున్న అతడు తనకు ప్రమాదం జరిగిందని చెప్పి టెక్కలికి రప్పించాడు. అది అబద్ధమని తెలుసుకున్న ఆమె అలిగి వెళ్లిపోతుండగా పట్టాలపై తలపెట్టాడు. స్థానికులు అప్రమత్తమై అతడిని కాపాడారు.అనంతరం పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు.