జనం న్యూస్ 03 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జిల్లా రామభద్రపురం పోలీసు స్టేషనులో 2021వ సంవత్సరంలో అత్యాచారంకు పాల్పడినట్లుగా నమోదైన కేసులో నిందితుడు రామభద్రపురం మండలం, పాతరేగ గ్రామానికి చెందిన గునపు సింహాద్రికి విజయనగరం మహిళా కోర్టు కమ్ 5వ ఎడిజె కోర్టు జడ్జి ఎన్. పద్మావతి 14 సంవత్సరాల కారాగార శిక్ష మరియు రూ.10 వేలు జరిమానా విధిస్తూ ఫిబ్రవరి 2న తీర్పు వెల్లడించినట్లుగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ తెలిపారు.కేసు వివరాలు: * రామభద్రపురం మండలం పాతరేగ గ్రామానికి చెందిన నిందితుడు గునపు సింహాద్రి అదే గ్రామానికి చెందిన ఒకామెను బలవంతంగా పలుమార్లు అత్యాచారంకు పాల్పడినట్లు ఇచ్చిన ఫిర్యాదుతో రామభద్రపురం పోలీసు స్టేషనులో 2021లో అప్పటి ఎస్ఐ ఎస్. కృష్ణమూర్తి కేసు నమోదు చేశారు. * అప్పటి సాలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టరు ఎల్. అప్పల నాయుడు దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించి, నిందితుడిపై న్యాయస్థానంలో అభియోగ పత్రం దాఖలు చేశారు. * న్యాయస్థానంలో నిందితుడు గునపు సింహాద్రి నేరంకు పాల్పడినట్లుగా సాక్ష్యాలు నిరూపితం కావడంతో విజయనగరం మహిళా కోర్టు కమ్ 5వ ఎ.డి.జె. కోర్టు న్యాయమూర్తి ఎన్. పద్మావతి 14 సంవత్సరాల కారాగార శిక్ష మరియు రూ.10 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.అభినందనలు:ఈ కేసులో నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసుల తరుపున పబ్లిక్ ప్రాసిక్యూటరు వై. రేవతి వాదనలు వినిపించగా, బొబ్బిలి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టరు కె. నారాయణరావు పర్యవేక్షణలో కోర్టు హెడ్ కానిస్టేబుల్ వి. ఎల్.వి. నారాయణ, సి.ఎం.ఎస్ ఏఎస్ఐ పి. మల్లేశ్వరరావు సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపరిచారు. కేసులో త్వరితగతిన నిందితుడికి శిక్షపడే విధంగా వ్యవహరించిన దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్ అధికారులను జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ అభినందించారు.


