Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 3 అనకాపల్లి జిల్లా రిపోర్టర్

కృష్ణ84 వ వార్డు కొత్తూరు నర్సింగరావుపేట అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో హ్యాండ్లింగ్ ఎక్స్ రే ప్రారంభం జరిగిందని తెలుగుదేశం 84వ ఇంచార్జ్ మాదంశెట్టి నీలబాబు తెలియజేశారు. కొప్పాక నర్సింగరావుపేట శిరసపల్లి రాజుపాలెం ప్రాంతాల నుండి అనారోగ్యంతో వచ్చేవారికి ఎక్స్ రే అవసరం అయినప్పుడు ఎన్టీఆర్ ఏరియా ఆసుపత్రికి పంపేవారని, ఈ సమస్యను శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ కు పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ కు మేయర్ పీలా శ్రీనివాసరావు కు అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ పీలా గోవింద సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లి కొత్తూరు నర్సింగరావుపేట అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో హ్యాండ్లింగ్ ఎక్స్రే పెట్టడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కార్పొరేటర్ మాదంశెట్టి చినతల్లి నీలబాబు తెలియజేసిన పిదప హ్యాండ్లింగ్ ఎక్స్రే యూనిట్ మంజూరు చేసి ఈ ప్రాంత ప్రజలకు ఉపకారం చేశారని, అనకాపల్లి కి వెళ్లే అవకాశం లేకుండా ఇక్కడే యాక్సరే తీసే విధంగా చర్యలు చేపట్టినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని నీలబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎంహెచ్ఓ, మెడికల్ ఆఫీసర్ కూటమి నాయకులు కసిరెడ్డి సత్యనారాయణ జి సురేష్ పైడిరాజు దుర్గాప్రసాద్ ఎస్ ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.//