Listen to this article

సంగారెడ్డి ఇన్చార్జ్ బి వీరేశంజనం న్యూస్ ఫిబ్రవరి 3

రావడంతో ఆమె ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. బీ ఫామ్ వచ్చిన వెంటనే గ్రామంలోని ప్రతి వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజలతో నేరుగా మమేకమవుతున్నారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకురాలిగా పని చేస్తానని మద్దూరి సునీత ఈ సందర్భంగా తెలిపారు. కోహిర్ గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి, తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను కౌన్సిల్‌లో బలంగా ప్రస్తావిస్తూ పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె స్పష్టం చేశారు. మద్దూరి సునీత ప్రచారానికి గ్రామ ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుండగా, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని, ప్రజల ఆశీర్వాదంతో కోహిర్ గ్రామ అభివృద్ధికి బాటలు వేస్తానని మద్దూరి సునీత ధీమా వ్యక్తం చేశారు.