Listen to this article

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.

ఉమ్మడి కడప జిల్లాలో మహాత్మ జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, విజయవాడ క్రింద పనిచేస్తున్న బాలికలకు గల నందలూరు, వనిపెంట, తొండూరు మరియు బాలురకు గల కమలాపురం, జమ్మలమడుగు గురుకులాల్లో ఐదవ తరగతి, జూనియర్ ఇంటర్మీడియట్ మరియు 6,7,8 తరగతుల మిగులు సీట్ల ప్రవేశాలకు గాను 04-02-2026 నుండి 04-03-2026 వరకు mjpapbcwreis.apcfss.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఉమ్మడి కడప జిల్లా కన్వీనర్ కెవిఎస్ రామకృష్ణారెడ్డి ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు ఆయా పాఠశాలల పని దినములలో గాని ఉమ్మడి కడప జిల్లాల కన్వీనర్ కార్యాలయం అయినటువంటి మహాత్మ జ్యోతిబాపూలే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల నందలూరు నందు సంప్రదించగలరు.