Listen to this article

. జనం న్యూస్:ఫిబ్రవరి 3 ( రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా)

పశ్చిమ ప్రాంతంలో మార్కాపురం పట్టణం లోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా రెండవ సారి యక్కలి కాశీ విశ్వనాధం ని నియమిస్తూ ఆ శాఖ నుండి నేడు ఉత్తర్వులు జారి అయ్యాయి. ఈయన నియామకం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్త మవుతున్నాయి. నా నియమానికి కృషి చేసిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మరియు పార్టీ నాయకులకు యక్కలి కాశీ విశ్వనాదం కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధి కి శాయశక్తుల కృషి చేస్తానని ఆయన అన్నారు.