Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 3 చిలిపి చెడు మండల ప్రతినిధి

మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో చండూర్ ఎక్స్ రోడ్ వద్ద వాహనాలు ముమ్మరంగా తనిఖీ చేశారు ప్రయాణికులు మద్యం తాగి వాహనాలు నడపవద్దని సూచించారు అలాగే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని వాహనదారులకు తెలియజేశారు మెదక్ జాతీయ రహదారిపై సాయంత్రం వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేశారు వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపాలన్నారు అదేవిధంగా వాహనం యొక్క ఇన్సూరెన్స్ బండి కాగితాలు అలాగే లైసెన్సు తప్పకుండా ఉంచుకోవాలని సూచించారు వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడపవద్దని సూచించారు మద్యం తాగి వాహనం నడిపితే ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నందువల్ల ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను రక్షించుకోవాలన్నారు అలాగే మద్యం తాగి వాహనం నడిపితే ఏదైనా జరగరానిది జరిగితే ఒక కుటుంబం రోడ్డు మీద పడుతుంది అందుకని తమ వాహనాలను జాగ్రత్తగా నడపకోవాలని వాహనదారులకు పలు సూచనలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చిలిపి చెడు మండల ఎస్సై నర్సింలు మరియు ఏఎస్ఐ రాములు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు