జనం న్యూస్ ఫిబ్రవరి 03: జగిత్యాల జిల్లా మెట్పల్లి మండల
కేంద్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీవారి కళ్యాణ మహోత్సవం అపూర్వ వైభవంగా నిర్వహించబడింది.ఈ శుభ సందర్భంగా మెట్పల్లి ఎల్‌ఐసి మేనేజర్ రామ శాస్త్రి దంపతులకు పంతులుగారు పూర్ణకుంభంతో శాస్త్రోక్తంగా ఘన స్వాగతం పలికారు.ఈ పవిత్ర కళ్యాణోత్సవంలో ఎల్‌ఐసి లియాఫీ డివిజన్ కోశాధికారి ఉత్కం వెంకట్ గౌడ్ , మల్లారెడ్డి , మర్రి భాస్కర్ , పురుషోత్తం , వెంకటరత్నం తదితర భక్తులు పాల్గొని శ్రీవారి కళ్యాణాన్ని భక్తిశ్రద్ధలతో దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.


